25న రాష్ట్ర మంత్రివర్గం
స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తొమ్మిది రోజుల వ్యవధితో రాష్ట్ర మంత్రివర్గం మరోసారి భేటీ కాబోతోంది. ఈనెల 25న క్యాబినెట్‌ను సమావేశపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ యించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్త ర్వులు జారీ చేశారు. 25న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో ‘కొత్త విద్యుత్ కేంద్రాలే’ ప్రధాన ఎజెండా కానున్నాయి. రామగుండంలో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు, రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం వద్ద 750 మెగావాట్లు, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మరో 750 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ సంస్థల ఏర్పాటు, ప్రయివేటు కంపెనీల ఆధ్వర్యంలో నిర్మించబోయే రెండు వేల మెగా వాట్ల పంప్ స్టోరేజీ ప్లాంట్ల నిర్మాణంపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోను న్నారు. ఇందుకనుగుణంగా ఎజెండా ఖరారు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వీటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలన, ఆ క్రమంలో నిర్వ హించబోయే ఉత్సవాలు, వేడుకలు, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ తదితరాంశాలపై మంత్రివర్గం మరోసారి చర్చిం చనుంది. ఇటీవల మహిళా సంఘాలకు పంపిణీ చేసిన చీరెలు, ఆయా సమాఖ్య లకు కేటాయించిన ఆర్టీసీ బస్సులు, వాటి నిర్వహణపై కూడా మంత్రివర్గం సమాలోచనలు చేయనుంది. వీటితోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలపై కూడా చర్చించ నున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి బోర్డుపై చర్చించి, తగు నిర్ణయం తీసుకో నున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
విద్యుత్ కేంద్రాలే ప్రధాన ఎజెండా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



