Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఆటలుపవర్‌ ప్లే 30 శాతమే

పవర్‌ ప్లే 30 శాతమే

- Advertisement -

కుదించిన టీ20ల్లో కొత్త రూల్స్‌
ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఆమోదం

దుబాయ్‌ (యుఏఈ) : ఆధునిక క్రికెట్‌లో ఆటను మరింత అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఐసీసీ కీలక నిబంధనలను మార్పు చేసింది. టెస్టు క్రికెట్‌లోనూ స్టాప్‌క్లాక్‌, నో బాల్‌కు క్యాచౌట్‌ రివ్యూ సహా బంతి మార్పునకు ఉమ్మి వాడకం తనిఖీ వంటి రూల్స్‌ 2025-27 డబ్ల్యూటీసీ నుంచి అమల్లో రాగా.. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లోనూ పలు రూల్స్‌ జులై 2 నుంచి అమలు కానున్నాయి. టీ20 క్రికెట్‌లో పరిస్థితుల కారణంగా మ్యాచ్‌ను (ఓవర్లు) కుదించినప్పుడు పవర్‌ప్లే నిడివిపై నిబంధనలు మార్పు చేశారు. ఇప్పటివరకు కుదించిన మ్యాచ్‌లో పవర్‌ప్లేను సమీప ఓవర్‌కు రౌండ్‌ఆఫ్‌ చేశారు. కానీ ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే నిడివి 30 శాతం మాత్రమే ఉండేలా కొత్త రూల్స్‌ ఉన్నాయి. 19-17 ఓవర్ల మ్యాచ్‌కు గతంలో ఆరు ఓవర్ల పవర్‌ప్లే ఉండగా.. ఇక నుంచి వరుసగా 5.4, 5.2, 5.1 ఓవర్ల పవర్‌ప్లే అమలు చేస్తారు. ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లకు1.3, ఆరు ఓవర్లకు 1.5, ఏడు ఓవర్లకు 2.1, ఎనిమిది ఓవర్లకు 2.2, తొమ్మిది ఓవర్లకు 2.4, పది ఓవర్లకు 3 ఓవర్ల పవర్‌ప్లే ఉండనుంది. ‘ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే 30 శాతం మాత్రమే ఉండేలా టీ20 బ్లాస్ట్‌లో ఇంగ్లాండ్‌ ప్రయోగించింది. ఓ ఓవర్‌ మధ్యలోనే పవర్‌ప్లే ముగియటం ఆటగాళ్లకు, అంపైర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని అధ్యయనంలో తేలింది. ఈ పద్దతినే టీ20ల్లో పాటించాలని ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీ నిర్ణయించింది’ అని ఐసీసీ సభ్య దేశాలతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించినట్టు సమాచారం. పవర్‌ప్లేలో 30 సర్కిల్‌ బయట ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్‌ బయట ఉండవచ్చు. టీ20 క్రికెట్‌లో ఈ రూల్‌ మార్పు గేమ్‌ఛేంజర్‌ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img