Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుTGNPDCL CMD: విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్నాం : టీజీఎన్‌పీడీసీఎల్‌ సంస్థ సీఎండీ

TGNPDCL CMD: విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్నాం : టీజీఎన్‌పీడీసీఎల్‌ సంస్థ సీఎండీ

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్నామని టీజీఎన్‌పీడీసీఎల్‌ సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలాయన్నారు. 21 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా వాటిలో 17 పునరుద్ధించినట్టు చెప్పారు. వరద నీటిలో 86 ట్రాన్స్‌ఫార్మర్లు మునిగాయని తెలిపారు.

విద్యుత్‌ సరఫరా నిలిచిన గ్రామాలకు సిబ్బంది వెంటనే వెళ్తున్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు బ్రేక్‌డౌన్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. విద్యుత్‌ సిబ్బంది రాత్రిపగలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఒక్క ఉద్యోగి కూడా సెలవులపై వెళ్లొద్దని ఆదేశించాం అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -