Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత: డిఈ శ్రీనివాసచారి 

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత: డిఈ శ్రీనివాసచారి 

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ
సబ్ స్టేషన్ లో మెయింటినెన్స్ సందర్భంగా రేపు మిర్యాలగూడ పట్టణంతోపాటు కొన్ని మండలాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు మిర్యాలగూడ ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస చారి తెలిపారు. బుధవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ గురువారం రోజు మిర్యాలగూడ 220 కె.వి  సబ్స్టేషన్లో స్టేషన్ ల్ మెయింటెనెన్స్ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. మిర్యాలగూడ టౌన్ వన్, టౌన్ టు,  మిర్యాలగూడ రూరల్, త్రిపురారం, వేములపల్లి, ఈ మండలాలకు సంబంధించిన 33 కె.వి / 11 కెవి సబ్స్టేషన్లకు  కరెంటు ఉండదన్నారు.  విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏడిఈ రవికుమార్, ఏఈలు  టౌన్ టు, రవీందర్ రెడ్డి, సబ్ ఇంజనీర్, అమర్ సింగ్, బాలు, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -