విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. ఈ చిత్ర టీజర్‌ను మహా శివరాత్రి శుభ సందర్భంగా అగ్ర కథా యకుడు మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. శనివారం మేకర్స్, ‘కేేజీఎఫ్’ ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ఆయన పోషిస్తున్న బైరాగి పాత్రను పరిచయం చేశారు. బూడిదతో శరీరం, జటాలతో కూడిన ఆయన లుక్ మిస్టికల్ టచ్ ఇచ్చింది. ఇంటెన్స్ లుక్స్, రుద్రాక్షలు, ఎముకలతో చేసిన మాలలు ఆయనను శక్తివంతమైన తాంత్రిక యోధుడిగా చూపిస్తున్నాయి.
గరుడ రామ్ చేతిలో కపాలాలు, ఎముకలు, పాములతో అలం కరించిన భారీ దండ కనిపిస్తూ, చీకటి, నిషిద్ధ శక్తులను సూచిస్తోంది. అడవి, పాములు, చెల్లాచెదురుగా ఉన్న కపాలాలు మరింత క్యురియాసిటీ పెంచుతున్నాయి.
కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శక్తివంతమైన బైరాగి
- Advertisement -
- Advertisement -



