Tuesday, July 8, 2025
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్‌గా 'మారెమ్మ'

పవర్‌ఫుల్‌గా ‘మారెమ్మ’

- Advertisement -

రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ రూరల్‌ రస్టిక్‌ మూవీ ‘మారెమ్మ’తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. మంచాల నాగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్‌ బ్యానర్‌పై మయూర్‌ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్‌ నెం.1గా నిర్మిస్తున్నారు.
సోమవారం మేకర్స్‌ ఈ చిత్రం ఇంపాక్ట్‌ ఫుల్‌ టైటిల్‌, అద్భుతమైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రెండింటినీ రిలీజ్‌ చేశారు. ఇది పవర్‌ ఫుల్‌ రూరల్‌ గ్రామీణ యాక్షన్‌ డ్రామాగా ఉంటుందని హామీ ఇస్తోంది.
ఫస్ట్‌ లుక్‌ మాధవ్‌ను రూరల్‌ అవతార్‌లో పరిచయం చేస్తుంది. పోస్టర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉంచబడిన ఒక గేదె, బలం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మాధవ్‌ పొడవాటి కర్రను పట్టుకుని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నట్లు కనిపించారు.
వినోద్‌ కుమార్‌, వికాస్‌ వశిష్ట, దయానంద్‌ రెడ్డి, వి.ఎస్‌.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాధవ్‌ సరసన దీపా బాలు కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉమేష్‌ విలాసాగరం, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కుశాల్‌ రెడ్డి కందాలా, డీవోపీ: ప్రశాంత్‌ అంకిరెడ్డి, సంగీతం : ప్రశాంత్‌ ఆర్‌ విహారి, ఎడిటర్‌: దేవ్‌ రాథోడ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజ్‌ కుమార్‌ మురుగేషన్‌, యాక్షన్‌ డైరెక్టర్‌: మాడిగొండ నటరాజ్‌, రచన-దర్శకత్వం :మంచాల నాగరాజ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -