ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కతున్న సినిమా గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న పథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ఉన్న ప్రతినాయకుడు కుంభగా, హెటైక్ వీల్ చెయిర్‌లో న్యూ ఏజ్ విలన్‌గా పథ్విరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు.
‘ట్రిపుల్ ఆర్’ ఆస్కార్ వేదిక మీద చేసిన సందడి తర్వాత రాజమౌళి ప్రాజెక్టుల మీద విశ్వవ్యాప్తంగా క్రేజ్ మరో రేంజ్‌లో ఉంది. ఆ స్థాయికి, ఆ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఇప్పుడు ది గ్లోబ్ ట్రాటర్ లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు రాజమౌళి. ఈ నెల 15న రామోజీఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తన పోస్టులో, ‘సెట్లో ముగ్గురితో క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. అయినా మరోవైపు గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌కి కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు మేం చేయని దానికి అతీతంగా ఈసారి చేయాలనుకుంటున్నాం. ఈనెల 15న మీరు వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయడాన్ని చూడ్డానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాం’ అని రాశారు.
పవర్‌ఫుల్ ప్రతినాయకుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



