Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇస్కాఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కడారు ప్రభాకర్‌రావు, ఆర్‌.గోపాల్‌

ఇస్కాఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కడారు ప్రభాకర్‌రావు, ఆర్‌.గోపాల్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కాఫ్‌) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.గోపాల్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్‌ సారంగపాణి, కె.భిక్షమయ్య, ఎస్‌.అరుణ్‌ కుమార్‌, వై రాఘవరావు, వి.వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్‌ డి.రాధాకృష్ణ, కార్యదర్శులుగా ఎన్‌ఎస్‌.అర్జున్‌ కుమార్‌, ఎన్‌.రాజమౌళి, కొండపర్తి శ్రీనివాస్‌, మద్దినేని రమేష్‌ బాబు, వి కొండలరావు, ఎంఏ కరీం, కోశాధికారిగా ఎ. విజయలక్ష్మితో మరో 20 మందితో కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగే ఇస్కాఫ్‌ జాతీయ మహాసభలకు తెలంగాణ నుంచి 30 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. ఇస్కాఫ్‌ రాష్ట్ర మహాసభ ఆదివారం జరిగిన విషయం విదితమే.
మహాసభ తీర్మానాలివే..
– వెనిజులాపై అమెరికా దాడులను నిర్బంధాలను, ఆంక్షలను తక్షణమే నిలిపివేయాలి.
– పాలస్తీనా దేశానికి తక్షణమే స్వాతంత్రం ప్రకటించాలి. ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులను ఆపేయాలి.
– భారత వాణిజ్యంపై సుంకాలను విధించి ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలను అమెరికా విరమించుకోవాలి.
– తెలంగాణలో ప్రతి జిల్లాలో కళాకారుల ప్రదర్శనలకు ఓపెన్‌ థియేటర్లను నిర్మించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -