- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు బుధవారం ఉదయం మరోసారి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అయితే మంగళవారం ప్రభాకర్ రావును విచారించగా.. ఆయన విచారణకు సహకరించలేదని అధికారులు తెలిపారు. దీంతో ఆయన ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. సెల్‌ఫోన్‌లో డేటాను డిలీట్ చేసినట్లు గుర్తించారు. అయితే ఆయన ఫోన్‌ను FSLకు పంపారు.
- Advertisement -