షరా మామూలుగానే సమాధానాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును మంగళవారం ఐదో రోజు సిట్ అధికారులు విచారణ జరిపారు. షరామామూలుగానే కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి, మరికొన్ని కీలకమైన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్టు తెలిసింది. అయితే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ప్రభాకర్ రావు, అతని అనుచర అధికారులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, వాటిని ధ్వంసం చేయడానికి గల కారణాలపైన సిట్ అధికారులు సీరియస్ గా ఆరా తీసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పొలిటికల్ బాసులలో ఎవరు ఆదేశాలిచ్చారనే విషయమై ప్రభాకర్‌రావును సిట్ అధికారులు తరచి తరచి అడగగా, మా సీనియర్లు చెప్పినట్టు చేశానని అసహనంతో సమాధానాలిచ్చినట్టు తెలిసింది.
ఐదో రోజు కొనసాగిన ప్రభాకర్‌రావు విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



