ప్రభాస్ త్వరలో ‘స్పిరిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక యూనిక్ ఆడియో టీజర్ ‘సౌండ్ స్టోరీ’ని విడుదల చేసింది. ఇందులో విజువల్స్ లేవు, కానీ ప్రభాస్, ప్రకాష్‌రాజ్ మధ్య జరిగే ఇంటెన్స్ డైలాగ్స్ అందర్నీ అలరిస్తున్నాయి. కథ ప్రకారం.. ప్రభాస్ ఒక అకాడమీ టాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కానీ ఓ కారణం వల్ల రిమాండ్‌లో జైలుకి వెళ్తాడు. అక్కడ జైలర్‌గా ఉన్న ప్రకాష్‌రాజ్ అతనికి సరైన పాఠం నేర్పించాలని, జైలు జెర్సీ ధరించమని ఆదేశిస్తే, ప్రభాస్ కూల్‌గా ‘చిన్నప్పటి నుండి నాకు ఒక బ్యాడ్ హాబిట్ ఉంది’ అని తనదైన యూటిడ్యూడ్‌తో ఇచ్చిన సమాధానంతో టీజర్ ముగుస్తుంది.
ఈ ఒక్క లైన్‌తోనే ప్రభాస్ పాత్ర ఎంత ఇన్‌టెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతుంది. అలాగే ప్రకాష్‌రాజ్ పాత్ర కూడా బలంగా ఉండనుంది. విజువల్స్ లేకుండానే ఉత్కంఠను రేపిన ఈ టీజర్ అభిమానులకు యూనిక్ బర్త్‌డే గిఫ్ట్‌గా నిలిచింది అని చిత్ర యూనిట్ తెలిపింది. ‘యానిల్’ సినిమాలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న త్రుప్తి దిమ్రి ఈసారి ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్, ‘అర్జున్ రెడ్డి’లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి కాంచన ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్
- Advertisement -
- Advertisement -



