నవతెలంగాణ – హైదరాబాద్: గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసింది. మరోవైపు, ఈ సినిమాలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై నెగెటివ్ కామెంట్స్, ఫేస్-స్వాప్ ట్రోల్స్ వరదలా వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డారు. చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు, కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
‘ఫౌజీ’ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కు గాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



