Sunday, May 25, 2025
Homeసినిమాప్రభాస్‌ 'స్పిరిట్‌' నాయిక..

ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ నాయిక..

- Advertisement -

ప్రభాస్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పిరిట్‌’. ‘యానిమల్‌’ ఫేం త్రుప్తి డిమ్రీ ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికైనట్లు మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు.
‘యానిమల్‌’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రుప్తి, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో మళ్లీ పనిచేయడం పట్ల, అలాగే ప్రభాస్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తొమ్మిది భాషల్లో విడుదల చేస్తామని అనౌన్స్‌ చేశారు. ఇది పాన్‌ వరల్డ్‌ విజన్‌ని తెలియజేస్తోంది.
భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌, టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ బ్యానర్లపై ప్రణరు రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్‌, కష్ణన్‌ కుమార్‌, మురాద్‌ ఖేతానీ నిర్మిస్తున్న ఈ చిత్రం భారత సినిమా చరిత్రలోనే ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలవనుంది. ప్రభాస్‌, డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేయనుంది అని మేకర్స్‌ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -