- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’ సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యులు సినిమాను పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా UA16+ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, ఫాంటసీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి రూపొందించిన ఈ సినిమా మొత్తం నిడివి సుమారుగా 3 గంటల 10 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.
- Advertisement -



