నవతెలంగాణ-పాలకుర్తి
నీట్ ప్రవేశ పరీక్షలు ప్రతిభను కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన మండలంలోని తీగారం గ్రామానికి చెందిన పోగు శ్రావణిని ప్రగతి విద్యాలయం ప్రిన్సిపాల్ వీరమనేని వెంకటేశ్వర్రావు బుధవారం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెడికల్ సీటు సాధించిన ప్రగతి విద్యార్థిని శ్రావణి జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ప్రగతి విద్యానిలయంలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించిన తీగారం గ్రామానికి చెందిన పోగు శ్రావణి ఎంబిబిఎస్ లో సీటు సాధించిందని ప్రిన్సిపాల్ వీరమనేని వెంకటేశ్వరరావు తెలియజేశారు. శ్రావణి, తండ్రి నాగరాజు లను ఘనంగా పాఠశాల ప్రిన్సిపాల్ సన్మానించారు. శ్రావణి మిగతా విద్యార్థులకు ప్రేరణగా నిలిచిందని, పాఠశాల స్థాయిలో అందించిన బేసిక్స్ ఆమె ఎదుగుదలకు ఉపయోగ పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమెకు ఎంబిబిఎస్ సీటు రావడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.