ఫిడె క్యాండిడేట్స్ టోర్నీ
న్యూఢిల్లీ : తొలి రౌండ్లో అనిశ్ గిరిపై విజయం సాధించిన రమేశ్ ప్రజ్ఞానంద.. ఫిడె 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో ముందంజలో కొనసాగుతున్నాడు. మంగళవారం చైనా గ్రాండ్‌మాస్టర్ వీ యితో ఓపెన్ విభాగంలో రెండో రౌండ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. చైనా గ్రాండ్‌మాస్టర్ పెట్రోఫ్ డిఫెన్స్‌తో మొదలెట్టి.. ఆధిపత్యం కోసం ప్రయత్నం చేశాడు. రూక్స్, చిన్న పావులతో ఎత్తులు వేసిన ప్రజ్ఞానంద.. ప్రత్యర్థిని నిలువరించాడు. ఇరువురు ఆటగాళ్లు రిస్క్ తీసుకునేందుకు మొగ్గు చూపలేదు. గేమ్ డ్రాగా ముగియగా, పాయింట్లు సమంగా పంచుకున్నారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్, రమేశ్ వైశాలి ముఖాముఖి గేమ్‌ను డ్రా చేసుకున్నారు.
ముందంజలోనే ప్రజ్ఞానంద
- Advertisement -
- Advertisement -



