Tuesday, January 13, 2026
E-PAPER
Homeజిల్లాలుఖమ్మం బహిరంగ సభలో ప్రజానాట్యమండలి భాగస్వామి కావాలి  

ఖమ్మం బహిరంగ సభలో ప్రజానాట్యమండలి భాగస్వామి కావాలి  

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను 
ఖమ్మం జిల్లా కేంద్రంలో జనవరి 18న నిర్వహించనున్న, సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకొని, ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ విజయవంతం కొరకు, ప్రజానాట్యమండలి సభ్యులు భాగస్వాములు కావాలని, ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెక వెంకటేష్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో మంగళవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజానాట్యమండలి, యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్య కళాకారుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు పోతు ప్రవీణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ,సిపిఐ భారీ బహిరంగ సభ సిపిఐ జాతీయ నాయకులు హాజరవుతారన్నారు. 

జిల్లా నుండి వేలమంది కవులు, కళాకారులు ప్రజలు, శ్రామికులు అనేక మందితో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షురాలు ఇంజ హిమలత, గిరవైన సామి ,బొడ్డు ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -