నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనంతారంలో గల వాత్స్యల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రజాపిత బ్రాహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాంప్ ఇన్చార్జి బి కె చంద్రావతి అక్కయ్య మాట్లాడుతూ.. బ్రహ్మాకుమారీల మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజయోగిని దాది ప్రకాశమణి జీ 18వ వర్ధంతి సందర్భంగా”యూనివర్సల్ బ్రదర్‌హుడ్ రోజుని పురస్కరించుకొను భారతదేశం, నేపాల్‌లో రక్తదాన కార్యక్రమం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించనున్నట్లు తెలిపారు.
ఈ మెగా ప్రచారాన్ని ఆగస్టు 17న న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జెపి నడ్డా ప్రారంభించారని, ఆగస్టు 22 నుండి 25 వరకు దేశవ్యాప్తంగా 1500+ బ్రహ్మాకుమారీ సేవా కేంద్రాల్లో ఒకేసారి భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ప్రచార లక్ష్యం 1 లక్ష (100,000) యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరుగుతుందని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పలువురు రక్త దానాన్ని చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ , చంద్ర శేఖర్, ఎం బాలేశ్వర్, రమేశ్వర్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
వాత్సల్యలో ప్రజాపిత రక్తదాన శిబిరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES