Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి

సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి

- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నవతెలంగాణ – తాడూరు
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ నుంచి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -