- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదిక ప్రజావాణి అని జన్నారం మండల తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన లో ప్రజావాణిలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను తమకు తెలిపితే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సంగీత, ఎంఈఓ విజయ్ కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -