Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దవంగర ఎస్సైగా ప్రమోద్ కుమార్ 

పెద్దవంగర ఎస్సైగా ప్రమోద్ కుమార్ 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగర ఎస్సైగా సీహెచ్ ప్రమోద్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన వరంగల్ సీసీఎస్ లో పని చేస్తూ, బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎస్సై గా విధులు నిర్వహించిన క్రాంతి కిరణ్ కేసముద్రం పోలీస్ స్టేషన్ కు ఇటీవల బదిలీ పై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు. నూతన ఎస్సై కి పోలీస్ సిబ్బంది స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు లింగయ్య, వెంకటయ్య, రమేష్, మోషిన్, అనిత, కళ్యాణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -