- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి నూతన తహహసిల్దార్ గా జి.ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహసిల్దార్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన కమ్మర్ పల్లి తహసిల్దార్ గా బదిలీపై వచ్చారు.ఇప్పటివరకు తహసిల్దారుగా కొనసాగిన ఆంజనేయులు పెద్దపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లారు. తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ ను కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -