Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయం విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..

 విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే), తమిళ అగ్ర నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి తాత్కాలికంగా తన సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన తన సొంత రాష్ట్రమైన బీహార్ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ‘జన్ స్వరాజ్’ పార్టీని పోటీకి నిలుపుతుండటంతో ఆ ఎన్నికల పనుల్లో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీవీకే రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ పాల్గొన్నారు. తమిళనాడులో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న విజయ్ పార్టీకి తన పూర్తి సహకారం అందిస్తానని అప్పట్లో ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం టీవీకేకు వ్యూహరచనలో సాయం చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం బీహార్ ఎన్నికల పనుల ఒత్తిడి కారణంగా ఆయన టీవీకే వ్యూహరచన బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే, అంటే ఈ ఏడాది నవంబర్ నాటికి ఆయన తిరిగి టీవీకేకు సలహాదారుగా బాధ్యతలు చేపడతారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -