Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంత్ రెడ్డికి కను వినుపు 

ప్రశాంత్ రెడ్డికి కను వినుపు 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్  బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు గురువారం కను వినుపు అనే కార్యక్రమాన్ని మోర్తాడ్ లో ఏర్పాటు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత్ రెడ్డి తన రౌడీయిజం ఇంకా మానుకోలేదని 10 సంవత్సరాల కాలంలో చేసిన రౌడీయిజాన్ని ఇంకా అమలు చేయాలని చూస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా గంజాయి మాయం చేసి ప్రజలను గుండాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. నేరుగా ప్రజలకు అందిస్తుందని, ఓర్వలేక గల్ఫ్ నిధులపై ప్ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -