Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖిల్లా వారోత్సవాలలో ప్రశాంతి స్కూల్ విద్యార్థికి మొదటి బహుమతి..

ఖిల్లా వారోత్సవాలలో ప్రశాంతి స్కూల్ విద్యార్థికి మొదటి బహుమతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
వారసత్వ వారోత్సవాలు భువనగిరి ఖిల్లా వద్ద అట్టహాసంగా జరిగాయి ఇట్టి కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, యాజమాన్యం, పట్టణంలోని ముఖ్యులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వారసత్వ శాఖ సంచాలకులు  ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి  విచ్చేశారు వారితోపాటు రాష్ట్ర వారసత్వ శాఖ ఉపసంచాలకులు డా”రాములు నాయక్ (టెక్నికల్ విభాగం) ఉప సంచాలకులు నర్సింగ్  (ఇంజనీరింగ్ విభాగం)లు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

పురాతన కట్టడాలు మనకు పూర్వీకులు ఇచ్చిన వారసత్వంగా భావించి వాటిని భవిష్యత్ తరాల కొరకు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు నేటి యువత, విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వారోత్సవాలను నిర్వహిస్తూ అందులో భాగంగానే పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించామని వీటి వలన పిల్లలకు చారిత్రక సంపదను పరిరక్షించుకునేందుకు అవగాహన కల్పించేందుకు అవకాశం ఉందని తెలిపారు.  భువనగిరిఖిల్లా అలనాటి వైభవాన్ని తెలుపుతూ, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని  ఇలాంటి పురాతన కట్టడాలు ఆనాటి రాజుల వైభవాన్ని కి సాక్షాలుగా నిలుస్తాయని,  వాటిని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, శాఖా పరంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన పాఠశాలలకు, ప్రముఖులకు, సహాయ సంచాలకులు వారసత్వ శాఖ అధికారి నాగలక్ష్మి అభినందనలు తెలిపారు. ఈ సూపర్ టెండెంట్ రాజు, సాయి కిరణ్ ,జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి ధనుంజయ్, వివేరా వెంకట్ రెడ్డి, దిడ్డి బాలాజీ, జంపాల అంజయ్య, బాలేశ్వర్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -