ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్స్
షింకెంట్ (కజకిస్తాన్) : రెండు సార్లు ఒలింపియన్, యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ మరో పసిడి పతకం సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్స్ విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ పసిడి గురితో మెరిశాడు. పసిడి వేటలో చైనా షూటర్, క్వాలిఫికేషన్ రౌండ్ టాపర్ వెన్యూపై 0.5 పాయింట్ల తేడాతో పైచేయి సాధించాడు. 2023 ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లోనూ పసిడి సాధించిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్‌కు ఈ ఈవెంట్‌లో ఇది రెండో బంగారు పతకం. ఆరంభం నుంచీ ఆధిక్యంలోనే నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్.. మరీ ఎక్కువ ముందంజ వేయలేదు. కానీ నిలకడగా పాయింట్లు సాధించి అగ్రస్థానం నిలుపుకున్నాడు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్ చైన్ సింగ్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.