Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతిభ బయోటెక్‌ ప్రత్యేకత

ప్రతిభ బయోటెక్‌ ప్రత్యేకత

- Advertisement -

రైతు బడి అగ్రి షోలో సేంద్రీయ సమతుల్య వ్యవసాయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న రైతు బడి అగ్రి షోలో ప్రతిభ బయోటెక్‌ వారి ఓఎన్‌బీఏ (సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం) ప్రత్యేకతను చాటుకొంది. కేవలం కంపెనీ ఉత్పత్తుల ప్రదర్శన కాకుండా రైతులకు వ్యవసాయ విధానం గురించి అవగాహన కలిగించే స్టాల్‌గా ఏర్పాటు చేసి రైతులకు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పెట్టుబడిని తగ్గించుకుని నాణ్యమైన అధిక దిగుబడులు ఎలా సాధించాలో వివరిస్తున్నారు. ఓఎన్‌బీఏ పుస్తకాలను, బ్రౌచర్స్‌ను రైతులకు అందచేస్తున్నారు. రైతుల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రతిభ బయోటెక్‌ వారు ప్రతి రైతుకు ఓఎన్‌బీఏ గురించి రెండు ప్రశ్నలున్న పేపర్‌ ఇచ్చి సరైన సమాధానాలు రాసిన వారికి రూ.100 విలువ చేసే ఉత్పత్తిని ఉచితంగా ఇస్తూ ఆకర్షణీయంగా నిలిచారు. ప్రతి రైతు ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానాన్ని అవలంబించి పాడైపోయిన వ్యవసాయ భూముల్ని సారవంతంగా మార్చుకుంటూ అధిక దిగుబడులు ఎలా సాధించాలో వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -