- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో గల సహకార బ్యాంక్ పర్సన్ ఇన్చార్జి ఆఫీసర్ గా పి ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సహకార శాఖ అధికారి ఉత్తర్వుల ఆర్ సి నెంబర్ 263/ 2025 – సి ప్రకారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో రాములు, సిబ్బంది నాగరాజు, నవీన్ రెడ్డి, నరసింహ, సత్తయ్య లు పాల్గొన్నారు.
- Advertisement -