డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్..
నవతెలంగాణ – చారకొండ
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జక్క రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన పి.ఆర్.సి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిపోయిన ఇంతవరకు ఊసే లేకుండా పోయింది. వెంటనే పి ఆర్ సి ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదు డిఎ లను పెండింగ్ పెట్టిన రాష్ట్రం ఎక్కడ లేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ధరల పెరుగుదలను ఉద్దేశించి ఉద్యోగులకు , ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన డి ఏ లను నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటివరకు కూడా విడుదల చేయలేదు.
జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలో నియమించబడిన శానిటైజేషన్ వర్కర్స్ శాలరీలను ఇంతవరకు విడుదల చేయలేదని పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి జీతాలను వెంటనే విడుదల చేయాలన్నారు.మండలంలో చాలా పాఠశాలలు వర్షాకాలంలో తడిసి గోడలు, పైకప్పు , పెచ్చులు ఊడిపోయే స్థితిలో ఉన్నాయి. బొమ్మల గుడిసెలు పాఠశాల పూర్తిగా నిమ్మెక్కి ఉంది. ఏ క్షణంలో కూలుతుందో అని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు విద్యార్థినీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కావున జిల్లా కలెక్టర్ స్పందింకి బొమ్మల గుడిసెల పాఠశాలకు నిధులు మంజూరు చేసి పాఠశాలను పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు పాండయ్య, డిటీ నాయక్, మండల బాధ్యుడు రాజు పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు అశోక్ పాల్గొన్నారు
పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES