పిఆర్సిని వెంటనే ప్రకటించాలి

నవతెలంగాణ-కంటేశ్వర్ :రాష్ట్రం ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన పే రివిజన్ కమిటీ నీ ముప్పై శాతం ఇంటీరియం రిలీఫ్ తో వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ  డిమాండ్ చేసింది. శనివారం సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గం సమావేశంలో పలువురు నాయకులు పెన్షనర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసించారు. పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ను పటిష్ట పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రి రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి ఈ. వి. ఎల్. నారాయణ ఉపాధ్యక్షులు లావు వీరయ్య, జార్జి, దీన సుజాన, శిర్ప హనుమాన్డ్లు ప్రసాద్ రావు, రాధాకృష్ణ, బోజారావు , అద్దంకి ఉషాన్ , జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love