– ఐదు పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
– లేకపోతే పెద్ద ఎత్తున ఐక్యపోరాటాలు : టీయుఎంహెచ్‌ఇయూ రాష్ట్ర సదస్సు తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండవ పీఆర్సీని 51 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించి అమలు చేయాలనీ, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయు ఎంహెచ్‌ఇయూ) డిమాండ్ చేసింది. యూనియన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, అధ్యక్షులు ఎండి.ఫసియొద్దీన్, ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్, వైద్యారోగ్యరంగంలోని వివిధ సంఘాల నాయకులు ఎస్.మురళీధర్ రెడ్డి, ఎ.రమేశ్ నాయక్, కె.బలరాం, బి.దేవి సింగ్, ఎస్.హరిశంకర్, బైరపాక శ్రీని వాస్, ఎస్.కె.ప్రసన్న, వి.మరియమ్మ, వై.ప్రమీల, వి.భూ లక్ష్మి, వి.నవీన్, ఎన్.దేవయ్య, జె.సుధాకర్, వి.విజయ వర్థన్ రాజు తదితరులు పాల్గొన్నారు. వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2023 జులై 1 నుంచి రెండవ పీఆర్సీ రావాల్సి ఉంది. ఈ మేరకు పీఆర్సీ, ఐదు పెండింగ్ డీఏలు, రిటైర్ ఉద్యోగులు, సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అధికారంలోకి వచ్చి 18 నెలల గడిచిన పెండింగ్ డిమాండ్లలో ఒక్క సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని సమావేశంలో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు డీఏలు పెండింగ్ లో ఉండటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులను కూడా కల్పించకపోవడం అన్యాయమని విమర్శించారు. రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక గుండెపోటుతో చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక విశ్రాంత ప్రధానో పాధ్యాయులు కొండేటి సోమిరెడ్డి గుండెపోటుతో మరణించారని వారు గుర్తుచేశారు. ఆధార్ బేస్‌డ్ అటెండెన్స్ సిస్టమ్‌ను రద్దు చేయాలనీ, ఈ-కుబేర్ వ్యవస్థను రద్దు చేసి ట్రెజరీల ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు.
పీఆర్సీ ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES