Monday, November 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలి

పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలి

- Advertisement -

టీపీటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరిపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నారాయణమ్మ, డి.శ్రీనివాస్‌, ఎం.లక్ష్మయ్య యాదవ్‌, బి.రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఆత్రం భుజంగరావు, రావుల రమేష్‌, ఎస్‌.విజయ్, దామెర రాజయ్య, సిద్దోజు కవితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వేతన సవరణకై ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పే-రివిజన్‌ కమీషన్‌ రూపొందించిన పీఆర్‌సీ రిపోర్టును ప్రభుత్వం వెంటనే ప్రకటించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వివిధ రకాల పెండింగ్‌ ఆర్థిక బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. 317 జీ.ఓతో నష్టపోయిన ఉపాధ్యాయులకు మూడేండ్ల తాత్కాలిక బదిలీ కోసం విడుదల చేసిన 190 జీ.ఓలో మార్పులు చేయాలనీ, ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ జీ.ఓ.25 ప్రకారం చేయాలనే నిబంధనలను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ఉద్యోగులకు నగదురహిత వైద్యాన్ని అందించే విధంగా హెల్త్‌ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆశ్రమ పాఠశాలల, ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో మూడు దశల్లో పోరాటాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గిరిజన సంక్షేమ శాఖ చొరవ తీసుకోవాలని కోరారు. పాఠశాలల పని వేళల్లో ఉపాధ్యాయులను తరగతి బోధనకు దూరం చేసే విధంగా నిర్వహించే వృత్యంతర శిక్షణలను నిలిపేసి వేసవి సెలవుల్లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాల్లో విద్యారంగానికి సంబంధంలేని, అర్హతలు లేని అధికారులను జిల్లా విద్యాధికారులుగా నియమించడాన్ని ఆయన ఖండించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే విడుదల చేయాలనీ, గురుకుల, మోడల్‌ స్కూల్‌ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -