Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వృద్ధాప్య పూర్వ విద్యార్థుల సమ్మేళనం

వృద్ధాప్య పూర్వ విద్యార్థుల సమ్మేళనం

- Advertisement -

15 ఏళ్లుగా విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహంగా ఇస్తున్న పూర్వ విద్యార్థులు 
1964 నుండి 69వ బ్యాచ్ వృద్ధాప్య పూర్వ విద్యార్థులు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధ పూర్వ విద్యార్థులు 1964 నుండి 69వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం గత 15 ఏళ్ల నుండి నిర్వహించుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 15 ఏళ్ల నుండి జడ్పీహెచ్ఎస్ మరియు గౌట్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న మెరిట్ వి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సహించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జి సోమయ్య ఆంజనేయులు మల్లారెడ్డి లక్ష్మీనరసయ్య శేషావతారం వెంకటరాములు గడ్డం లక్ష్మీనరసింహ అప్పన స్వామి లు మాట్లాడుతూ.. 1964 నుండి 69వ బ్యాచ్ పూర్వ వృద్ధ విద్యార్థుల మేము గత 15 సంవత్సరాల నుండి గణతంత్ర దినోత్సవం పరస్కరించుకొని జడ్పీహచ్ఎస్ హైస్కూల్ మరియు గౌట్ హైస్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు అత్యంత చదువు చదువుకొని ఎక్కువ మార్కులు సాధించి క్రమశిక్షణతో ఉన్నటువంటి వారికి ప్రథమ బహుమతి మూడువేల రూపాయలు ద్వితీయ బహుమతి 2500 చొప్పున నగదు బహుమతి ఈ రెండు పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఇస్తున్నామని అన్నారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. మేము గతంలో ఈ పాఠశాల చదువుకొని వివిధ రంగాలలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయి వృద్ధాప్యంలో ఉండి కూడా పాఠశాల మరియు విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మాకు పాఠాలు బోధించిన గురువులకు శాలువతో ఘనంగా సత్కరించి వారి పాదాభివందనాలు చేస్తున్నమని అన్నారు. వారు చెప్పిన బోధనలతోనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండి కొంతమందికి సహాయం అందించి స్థాయిలో ఉన్నామని అన్నారు. విద్యార్థులు మీరు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లి మీరు కొంతమందికి మీ వంతు సహాయ సహకారాలు సమాజానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధాప్య పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -