- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వెల్దండ మండల కేంద్రానికి చెందిన పలువురు ఆశా కార్యకర్తలను పోలీసులు సోమవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ కి వెళ్తున్నారనే సమాచారంతో ఆశ వర్కర్లు బాలమణి, సుజాత, అనిత, యాదమ్మ, పద్మలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా వెళ్తుంటే అరెస్టు చేయడం తగదని ఆశ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
- Advertisement -



