- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ముఖ్యమైన పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను జుక్కల్ పోలీసులు అరెస్టులు చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న జుక్కల్ మండలంలోని పలువురు తాజా మరియు మాజీ సర్పంచులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులను పోలీసులు అరెస్టు చేసి అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా కట్టడి చేసి అరెస్టు చేశారని అన్నారు.
- Advertisement -



