Thursday, March 26, 2026
E-PAPER
Homeఖమ్మంఉపాధ్యాయుల ముందస్తు అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

ఉపాధ్యాయుల ముందస్తు అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

- Advertisement -

* టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ 

నవతెలంగాణ – బోనకల్: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల, అర్భన్ రెసిడెన్షియల్ పాఠశాలల, సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం కాకుండా నాయకులను ముందస్తు అరెస్టు చేసి అడ్డుకోవడం అప్రజాస్వామికం అని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ పోలీసులు రామకృష్ణ ను గురువారం ముందస్తు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ కి తగ్గ మినిమం బేసిక్ పే ఇవ్వాలని ,ఆరోగ్య కార్డులను విడుదల చేయాలని, హాస్టళ్లలో కేర్ టేకర్లను నియమించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చేయాలని, గత సంవత్సర సమ్మె కాలపు హామీలు అమలు చేయాలని, వేతనం చెల్లించాలని డిమాండ్  చేశారు. టిఎస్ యుటిఎఫ్  రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు శాంతియుతంగా జరప తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు నాయకులను ముందస్తు అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. అక్రమ అరెస్టులను ఖండించిన వారిలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు సద్దాబాబు, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ జల్లా కోటయ్య, మండల అధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు, మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, మండల కోశాధికారి పి నరసింహారావు, ఉపాధ్యక్షురాలు బి సౌభాగ్య లక్ష్మి, మహిళ నాయకురాలు బి నిర్మల, యు గంగాభవాని, పి రాణి, సోషల్ మీడియా కన్వీనర్ ఎం నరేంద్ర సింహ, వి రామారావు, అలవాల నాగేందర్, సిహెచ్ కోటేశ్వరరావు, కే సురేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -