నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి ఎంపీపీ ఎస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ యూకేజీ నూతన గది తరగతిని గ్రామ సర్పంచ్ మారుతి ప్రారంభించారని జిపి కార్యదర్శి సుదీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాధికారి తిరుపతయ్య, జుక్కల్ క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయుడు హనుమంత రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఈఓ తిరుపతయ్య క్లస్టర్ హెచ్ఎం హనుమంత రెడ్డి మాట్లాడుతూ ఫ్రీ ప్రైమరీ యూకేజీ Pre -Primary (UKG ) తరగతి గదిని ప్రారంభించుకోవడం దోస్త్ పల్లి గ్రామ సర్పంచ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేద విద్యార్థులైన చిన్నారులకు గ్రామంలోని యూకేజీ విద్యను అందించేందుకు ప్రభుత్వం త్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించిందని అన్నారు.
తదనంతరం సమావేశాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ మారుతి , మాట్లాడుతూ దోస్త్ పల్లి పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం (2025-2026) నుండి యూకేజీ ( UKG ) తరగతిని విద్యాశాఖ అనుమతి తో అధికారికంగా ప్రారంభించడం జరిగిందని విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య కేవలం 11 మంది తెలిపారు. ప్రధానోపాధ్యాయులు వి. శంకర్ కృషి తో విద్యార్థుల సంఖ్య 36 కి పెరిగిందని అన్నారు. యూకేజీ ( UKG ) తరగతిని ప్రభావవంతంగా నిర్వహించడం కోసం ఒక ఇన్స్ట్రక్టర్ మరియు ఒక ఆయాని విద్యాశాఖ నియమించడం జరిగిందని తెలపడం జరిగింది.
ప్రభుత్వం కల్పిస్పిస్తున్న ఇట్టి సౌకర్యాలను, సదుపాయాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ పెంచాలని సూచించడం జరిగింది. విద్యాశాఖ తరపున అన్ని వేళల అన్ని విధాలుగా పూర్తి సహకారం పాఠశాలకు అందిస్తామని కాంప్లెక్స్ హెచ్ఎం హన్మంత్ రెడ్డి తెలపడం జరిగింది. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మారొతి , పెద్దలు దత్తు పటేల్ , సిఆర్పి, &పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



