Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడిలో పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ దినోత్సవం

అంగన్వాడిలో పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని కాటారం ,గంగారం సెక్టర్ పరిధి లోని ప్రతి అంగన్వాడి  కేంద్రాలలో ” పూర్వ ప్రాథమిక విద్య ,సంరక్షణ ” దినోస్తావం(ఈ సి సి ఈ) డే కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి డి పి ఓ రాధిక మాట్లాడుతూ … పూర్వ , బాల్య దశ ప్రాముక్యత ,మెదడు అభివృద్ధి గురించి తల్లి తండ్రులకు వివరించారు. పూర్వ ప్రాథమిక విద్య ,సంరక్షణ ” దినోస్తావం(ఈ సి సి ఈ) డే కార్యక్రమం ప్రతిష్ట పరచడానికి ప్రతి అంగన్వాడి సెంటర్ నందు ప్రతినెల నాలుగవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.

తల్లిదండ్రుల భాగ్య స్వామ్యం  ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రతినెల జరుపుకునే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సిడిపిఓ రాధిక తెలిపారు. ప్రీ స్కూల్ పిల్లల రోజు వారికి కార్యక్రమంలో భాగంగా పిల్లలకు నేర్పించే విద్య విధానాన్ని తల్లిదండ్రులకు డిస్ప్లే ద్వారా తెలియపరచడం జరిగిందని ప్రీస్కూల్ పిల్లల ఆక్టివిటీస్ కూడా తల్లిదండ్రుల ముందు ప్రదర్శించామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు అంగన్వాడి టీచర్లు. తల్లి తండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad