Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడిల్లో పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ దినోత్సవం..

అంగన్వాడిల్లో పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో తాడిచెర్ల, పెద్దతూoడ్ల, మల్లారం తోపాటు అన్ని గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాల్లో ”పూర్వ ప్రాథమిక విద్య, సంరక్షణ” దినోత్సవం (ఈసిసిఈ)డే కార్యక్రమం శనివారం నిర్వహించినట్లుగా అంగన్ వాడి టీచర్ అన్నపూర్ణ, పద్మ, అరుణ, జయప్రద తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పూర్వ ,బాల్య దశ,ప్రాముక్యత,మెదడు అభివృద్ధి గురించి తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు. పూర్వ ప్రాథమిక విద్య ,సంరక్షణ”దినోత్సవం(ఈసిసిఈ)డే కార్యక్రమం ప్రతిష్ట పరచడానికి ప్రతినెల నాలుగవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. తల్లిదండ్రుల భాగ్య స్వామ్యం ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రతినెల జరుపుకునే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తల్లి తండ్రులు,చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad