రసూల్ బి, జిల్లా సంక్షేమ అధికారి
నవతెలంగాణ ఆర్మూర్
టిఎల్ఎం తయారుచేసుకొని అంగన్వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యా బోధన నిర్వహించాలని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు. పట్టణ ప్రాజెక్టు పరిధిలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం ‘పోషణ్ బి… పడాయి బి` మూడు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. దీనిలో భాగంగా ఆధార్ శీల, నవచేతన, లబ్ధిదారులకు సంబంధించి పోషణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. అంగన్వాడి టీచర్లకు రిజిస్ట్రేషన్ చేయించి ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్టులు నిర్వహించి, పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా టీచర్లచే ప్రతిజ్ఞ చేయించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భార్గవి, సూపర్వైజర్లు సమత ,వెంకటరమణమ్మ, అన్నపూర్ణ, రేఖ, రామ, బిసి విలాస్ రావు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.