నవతెలంగాణ – దుబ్బాక
ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని సీఐటీయూ దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు,ఆయా లకు సంబంధించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 25 న నిర్వహించనున్న ‘ చలో సెక్రెటరియట్’ కార్యక్రమానికి దుబ్బాక్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని వివిధ సెక్టార్లలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు హాజరయ్యేందుకు వెళుతున్న సందర్భంగా అనుమతినివ్వాలని కోరుతూ సోమవారం దుబ్బాక లోని ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ ఎల్లయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. అంగన్వాడీలకు విద్యాబోధనకు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రూ.18 వేల కనీస వేతనంతో పాటు పీఎఫ్ ను చెల్లించాలని, మూడు నెలల పీఆర్సీ, మినీ అంగన్వాడీ టీచర్లకు 11 నెలల ఏరియర్స్, రిటైర్మెంట్ అయిన వారికి 10 నెలల సీబీఈ బకాయిల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి 5 జీ నెట్ వర్క్ తో కూడిన మొబైల్ ఫోన్లను ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు. సీఐటీయూ అంగన్వాడీ ప్రాజెక్టు కోశాధికారి ఎం. నాగరాణి ఉన్నారు.
ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీల్లోనే నిర్వహించాలి: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES