Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షాల నేప‌థ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలి: తహశీల్దార్

వర్షాల నేప‌థ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – అలేరు రూరల్
వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆలేరు తహశీల్దార్ ఆంజనేయులు అధికారులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలేరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మండల స్థాయి అధికారులతో తహశీల్దార్ కార్యాలయంలో ఆయ‌న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యంగా వర్షాలకు ఎక్కడైనా రోడ్లు, భవనాలు, నివాస గృహాలు, చెరువులు, కుంటలు దెబ్బతినే ప్రమాదాలు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూలు, అంగన్‌వాడీ సెంటర్లు ఏవైనా పాతవి ఉన్నట్లయితే, విద్యార్థులను గ్రామ పంచాయతీ భవనాలకు గానీ లేదా ఇతర ప్రభుత్వ భవనాలకు గానీ మార్చాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా గ్రామాల్లో కూలిపోయే దశలో ఉన్న పాత నివాస గృహాలు ఏవైనా ఉన్నట్లయితే అందులో నివసిస్తున్న వారిని కూడా సురక్షితమైన ప్రాంతాలకు, ప్రభుత్వ భవనాలకు త‌ర‌లించాల‌న్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎస్ఐ వినయ్, ఏఈ ఇరిగేషన్ విజయ్ కుమార్, ఎంపిఓ అనురాధ, శోభారాణి సీహెచ్ఓ, ఏపీఎం సత్యనారాయణ, అంగన్‌వాడీ సూపర్‌వైజ‌ర్ ఆండాలు, ఏఈఓ శివ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img