Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల కాలంలో జాగ్రత్తలు పాటించాలి..

సీజనల్ వ్యాధుల కాలంలో జాగ్రత్తలు పాటించాలి..

- Advertisement -

– మెడికల్ అధికారి యేమిమా
నవతెలంగాణ – భిక్కనూర్
సీజనల్ వ్యాధుల కాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించి పౌష్టికాహారం తీసుకోవాలని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మెడికల్ అధికారి యేమిమా తెలిపారు. గత 3 రోజుల నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ క్యాంపులో 26 మందికి జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు అందజేశారు. 4 నెలల కాలంలో మండలంలో ఇప్పటివరకు 7 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ మెడికల్ క్యాంపులో హెచ్ ఈ ఓ వెంకటరమణ, హెల్త్ సూపర్వైజర్ సువర్ణ, రాజమణి, ఎం ఎల్ హెచ్ పి పూజా, అమితా, ప్రశాంత్, ఏఎన్ఎం శ్యామల, మంజుల, మాధవి, యాదమ్మ, స్వరూప, హేమలత, యశోద, శ్యామల, వైద్య సిబ్బంది సతీష్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad