Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఈవీఎంల భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

ఈవీఎంల భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
వికారాబాద్‌లో ఈవీఎం గోదాం పరిశీలన


నవతెలంగాణ-వికారాబాద్‌
ఈవీఎంల భద్రత పట్ల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గురువారం వికారాబాద్‌ పట్టణంలో ఆయన పర్యటించారు. జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌తో కలిసి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అయన సూచించారు. సంబంధిత రిజిస్టర్‌లను పరిశీలించి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు. బీఎల్‌ఓల పేర్లు ఇచ్చారా? ఓటరు జాబితా పూర్తి అయినదా?, తదితర ఆంశాలపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ ప్రసాద్‌, డీఆర్‌ఓ మంగీలాల్‌, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్‌ లక్ష్మినారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నెమత్‌ హాలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -