Monday, July 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు  జాగ్రత్తలు తీసుకోవాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. వానాకాలం నేపథ్యంలో జన్నారం మండలంలోని చింతగూడ  తపాలాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. వ్యాధిగ్రస్థులు తప్పకుండా మందులు వాడాలని సూచించారు. పలువురికి పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు గోలిలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్ హెచ్ పి, సంధ్య ఏఎన్ఎం రాజేశ్వరి ఆశా కార్యకర్తలు స్వరూప కళావతి గ్రామ కార్యదర్శి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -