మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్..
నవతెలంగాణ-  డిచ్ పల్లి
దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా డెంగ్యూ,చికున్ గున్యా,ఫైలేరియా, మెదడు వాపు లాంటి వ్యాధులు అరికట్టడానికి పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇందల్ వాయి తండా  గ్రామంలోఇంటింటికి తిరిగి జ్వరంకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించి ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తిసుకోవలని, సీజనల్ వ్యాధులలో ఈగలు, దోమల వల్ల కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించామని వివరించారు. 100 ఇండ్ల చుట్టూ గల పరిసర ప్రాంతాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా టెమో పాస్ స్ప్రే చేయించారు.ఇంటింటికి జ్వరం సర్వే ఆశా కార్యకర్తలచే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, గ్రామ కార్యదర్శి జాస్మిన్,ఆరోగ్య కార్యకర్తలు రాధికా, సాయి వీర కుమారి ఆశా కార్యకర్త స్వప్న తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -

                                    

