Tuesday, October 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి: ఐసీడీఎస్ పీడీ రౌఫ్ ఖాన్

గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి: ఐసీడీఎస్ పీడీ రౌఫ్ ఖాన్

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందాలా చూడాలని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, లక్షెట్టిపేట సిడిపిఓ రేష్మ సూచించారు. మంగళవారం జన్నారంలోని  అటవీ శాఖ  టిడిసి సెంటర్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లక్షడిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల్లో వారు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంతో పాటు ఆరోగ్య సూచనలు కూడా అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్లు విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బాలింతలకు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు.

పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడే పుట్టిన పిల్లలు పుట్టబోయే పిల్లలు శారీరకంగా మానసికంగా దృఢంగా  ఉంటారన్నారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు లక్షట్ పేటలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు తీసుకువచ్చిన వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలతో ఏర్పాటుచేసిన, పౌష్టిక ఆహార స్టాల్ ను పరిశీలించారు. కార్యక్రమంలో జన్నారం ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -