నవతెలంగాణ – జన్నారం
గర్భవతులు బాలింతలు పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ, ఏపీఎం లలితా కుమారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల కేంద్రంలోని వసుంధర మండల సమాఖ్య సమావేశం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత.. మంచి ఆహారం తీసుకుంటేనే పుట్టిన పిల్లలు దృఢంగా ఉంటారన్నారు. పుట్టిన పిల్లలకు తప్పకుండా ముర్రుపాలు తాగించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికమైన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. అనంతరం ఏపీఎం లలితా కుమారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. గ్రామ సమైక్య సంఘాల్లో తప్పకుండా ఉండాలన్నారు. పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ఆర్థికంగా మహిళలు ఎదగాలని సూచించారు కార్యక్రమంలో ఐకెపి మహిళలు గ్రామ సమైక్య మహిళలు సీసీలు ఎస్ఆర్పీలు పాల్గొన్నారు.
గర్భవతులు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES