నవతెలంగాణ – హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆస్పత్రిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తాలూకా రావులపల్లికి చెందిన అఖిల(23) పురిటినొప్పులతో నిన్న అర్ధరాత్రి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అంతా నార్మల్‌గా ఉందని చెప్పి గంట తర్వాత మాట మార్చేశారు డాక్టర్లు. పరిస్థితి చేజారిపోయింది వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. అంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మృతి చెందింది. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సస్పెండ్ చేయాలని బంధువులు ఆసుసత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి..ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES