Monday, February 16, 2026
E-PAPER
Homeక్రైమ్వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి

వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి

- Advertisement -

– ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
నవతెలంగాణ-సిద్దిపేట

వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ.. సిద్దిపేటలోని మానస హాస్పిటల్‌లో గర్భిణి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన అశ్విని.. గర్భిణీ. ఆమె గర్భంలో బేబీ సరిగ్గా పెరగడం లేదని, సర్జరీ చేసి తొలగించాలని వైద్యులు చెప్పినట్టు బంధువులు తెలిపారు. మహిళకు ఆపరేషన్‌ చేసి బేబీని తొలగించే క్రమంలో బ్లీడింగ్‌ ఎక్కువ కావడంతో మరో హాస్పిటల్‌కు తరలించారన్నారు. మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అశ్విని మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. హాస్పిటల్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -